పార్వతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. ఈనాడు కథనం ప్రకారం.. అదివారం రాత్రి పార్వతీపురం రైల్వే స్టేషన్ మాస్టారు ఇచ్చిన సమాచారం మేరకు.. బెలగాం రైల్వే లెవిల్ క్రాసింగ్ కు కొద్ది దూరంలో రెండు మృతదేహాలనురైల్వే పోలీసులు గుర్తించారు. వారిలో ఒకరి వయసు 25 ఏళ్లు ఉండగా, కొద్ది దూరంలో 60 ఏళ్ల వయసున్న వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించారు. ఇద్దరూ ఒకే కుటుంబ సభ్యులా? వేర్వేరు కుటుంబాల వాళ్ల అని గుర్తించాల్సిందని, ఆత్మహత్యకు పాల్పడ్డారా..ప్రమాదవశాత్తూ జరిగిందా అనేది తెలియాల్సి ఉందని రైల్వే పోలీసులు తెలిపారు.