సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ సోమవారం ఆసక్తికర పోరు జరగనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ రెండు జట్లు తలపడనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడగా, 1 గెలిచి, 2 ఓడిపోయింది. అయితే గత మ్యాచ్‌లో పటిష్ట ముంబై జట్టుపై గెలిచిన ఉత్సాహంలో కేన్ విలియమ్స్ సేన ఉంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ఈ జట్టు ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. దీంతో అపజయమే లేకుండా ముందుకు సాగుతున్న గుజరాత్‌తో పోరు హైదరాబాద్ జట్టుకు సవాల్‌గా మారింది. ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే ప్రస్తుత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు తమ స్థాయి తగ్గట్టు ప్రదర్శన చేస్తే విజయం సాధించడం కష్టమేమీ కాకపోవచ్చు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది. ముంబైలోని స్టేడియాలు బ్యాటింగ్‌కు అనుకూలమైనవి కాబట్టి, ఛేజింగ్ చేసేందుకే జట్లు ఆసక్తి చూపుతున్నాయి.