ఐపీఎల్‌లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానం వేదికైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ గత మ్యాచ్ ఆడిన తరహాలోనే ఈ మ్యాచ్ లో కూడా అదే వ్యూహానికి సన్ రైజర్స్ కట్టుబడింది.
ఈ టోర్నీలో ఓడిన తర్వాత గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టులో ఎలాంటి మార్పు లేదు. అదే జట్టుతో గుజరాత్ టైటాన్స్ కూడా బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa