అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై నాగార్జున్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు కేవిబి పురం మండలంలోని అంజూరుకు చెందిన రమణయ్య గ్రామంలో అక్రమంగా మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. అతని నుంచి 15 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.