తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలంలోని ఉదయమానిక్యం పంచాయతీ గొల్లపల్లి సమీపంలో సారా విక్రయిస్తుండగా దాడులు చేశామని ఎస్ఐ వెంకటమోహన్ తెలిపారు. కోరువాండ్లపల్లికి చెందిన వెంకటరమణ, చింతగుంట పంచాయతీ నాగినేనివారిపల్లికి చెందిన నాగభూషణంను అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.