రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి గోదావరి డెల్టాలకు 9, 050 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టాకు 3, 500, మధ్య డెల్టాకు 2, 050, పశ్చిమ డెల్టాకు 3, 500 క్యూసెక్కులు వదిలారు. కాటన్ బ్యారేజ్ వద్ద సోమవారం సాయంత్రానికి 10. 30 అడుగులు వద్ద నీటి మట్టం కొనసాగుతున్నట్లు వివరించారు.