రాజోలు మండల చింతలపల్లిలో వేంచేసి వున్న ప్రాచీన పుణ్య క్షేత్రం మల్లాల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సోమవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామస్థులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా ఏర్పటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు, బాణాసంచా ఆకట్టుకున్నాయి. సమీప గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.