ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుష్పాలంకరణ తో ముస్తాబైన వాడపల్లి వెంకన్న స్వామి ఆలయం

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 01:17 PM

ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయం పుష్పాలంకరణ తో ముస్తాబయ్యింది. 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు శ్రీ స్వామివారి కల్యాణోత్సవాలు జరగనున్న విషయం భక్తులకు తెలిసిందే. 11వ తేదీన స్వామివారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరిగింది.
మేళతాళా లతో, కోలాటాలు, డప్పు వాయిద్యాలతో కోలాహలం గా జరిగింది. 12వతేదీన మధ్యాహ్నం 2గంటలకు జరగనున్న రధోత్సవానికి అతి భారీగా భక్తులు హాజరుకానున్నారు. సాయంత్రం 7గంటలకు స్వామి వారి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇందు కోసం ఆలయాన్ని, ఆలయ ప్రాంగణాన్ని రకరకాల పుష్పాలతో అలంకరించారు. ఈఅలంకరణతో స్వామివారి ఆలయం సౌందర్య భరితంగా మారింది. ఆలయంలోకి అడుగిడుతున్న భక్తులు వేరే లోకంలోకి వెళ్లిన అనుభూతి కి లోనౌతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com