అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం స్వల్పంగా ప్రారంభమైంది. US టెక్ స్టాక్స్ అమ్మకాలతో నిన్న నష్టపోయాయి. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు అక్కడి మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. అక్కడి నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న మార్కెట్లు ప్రతికూలంగా కదులుతున్నాయి. అలాగే భారత మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి.
క్రితం సెషన్‌లో సెన్సెక్స్ 58,965 పాయింట్ల వద్ద ముగిసింది. ఈరోజు 58,743 పాయింట్ల వద్ద ప్రారంభమై 58,338 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం 12.00 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 415 పాయింట్లు నష్టపోయి 58,549 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో సెన్సెక్స్ 600 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 146 పాయింట్లు క్షీణించి 17,528 వద్ద కొనసాగుతోంది. టీసీఎస్ త్రైమాసిక ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. ఈరోజు టీసీఎస్ షేర్లు 1 శాతంపైగా లాభపడి రూ.3,734 వద్ద ట్రేడవుతున్నాయి. ఫలితాల తర్వాత టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.