మహాత్మ జ్యోతి రావు ఫూలే 195 జయంతి సందర్భంగా బిసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ నాయకులు నెల్లూరు నగరంలో ఉన్న ఫూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలే జయంతి రోజు జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే సాంఘిక దురాచారాలైన బాల్యవివాహాలు, అంటరానితనం, వివక్షలపై అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు.
సత్యశోధక సమాజాన్ని స్థాపించి ఎందరికో విద్యనందించారన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు అన్నం శ్రీనివాసులు, వాసిలి సురేష్, తుమ్మారవి, మల్లె ప్రసాద్, మాముడూరు కృష్ణయ్య, కె. వి శేషయ్య, సలీమ్, పెరుమాళ్ళ కొండయ్య, పాల్గొన్నారు.