డిఫెండింగ్ ఛాంపియన్.. ఐదు సార్లు ఐపీఎల్ విజేత.. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్ తన స్థాయికి తగ్గట్లుగా ఆటతీరును కనబర్చడం లేదు.ఇప్పటికే వరసగా నాలుగు ఓటములను ఎదుర్కుంది. ఇప్పటికీ సీఎస్కే బోణీ కొట్టలేదు. ఇదిలా ఉంటే సీఎస్కేకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్, ఆల్ రౌండర్ దీపక్ చాహర్ కు గాయమైంది. గాయం నుంచి కోలుకుంటున్న క్రమంలో బెంగళూర్ ఎన్సీఏ లో మరో గాయం అయింది. దీంతో ఈ సీజన్ మొత్తానికి దీపక్ చాహర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ వేళంలో అత్యధికంగా రూ. 14 కోట్ల ధర పెట్టి దీపక్ చాహర్ ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. అయితే గాయం పాలైన దీపక్ చాహర్ కోలుకోవడానికి మరో నెల పడుతుందని తెలుస్తోంది. ఇప్పటికే చాహర్ లేకపోవడంతో చెన్నై పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోతోంది. దీంతో జట్టు ఓటముల పాలవుతోంది. మరోవైపు సీఎస్కే ఓటములతో కెప్టెన్ రవీంద్ర జడేజాపై విమర్శలు వస్తున్నాయి.