కోడిపందాలు నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసులు అకస్మాత్తుగా దాడి చేశారు. గుడ్లూరు మండలం కర్లపాలెం గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానిక మండలంలోని కర్లపాలెం గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్నారని సమాచారం పోలీసులకు అందింది. దీంతో కోడిపందాల స్థావరాలపై గుడ్లూరు ఎస్ ఐ తమ సిబ్బందితో దాడి చేశారు. పోలీసులను చూసి కోడి పందాలు నిర్వహిస్తున్న వారు పరారైనట్లు ఎస్ ఐ మల్లికార్జున తెలిపారు. అక్కడ ఉన్న మూడు కోడి పుంజులు, 6 బైకులు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa