ఈ నెల 15వ తేదీ నుంచి సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నామని కలెక్టర్ మల్లికార్జున మంగళవారం ప్రకటించారు. ఏటా వేసవిలో చేపల పునరుత్పత్తి సమయంలో వేటపై ఆంక్షలు విధించడం ఆనవాయితీగా వస్తోందని. జూన్ 14 వరకు ఈ నిషేధపు ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
మెకానైజ్డ్ బోట్లు, మోటారు బోట్లు వేటకు వెళ్లకూడదన్నారు. అయితే తెడ్లు, తెరచాపలతో నడిచే సంప్రదాయ బోట్లకు ఈ నిషేధం వర్తించదన్నారు. ఈ రెండు నెలల కాలంలో మత్స్యకారుల జీవన భృతికి ప్రభుత్వం రూ. 10 వేలు ఇస్తుందన్నారు. అయితే ఆ బోటు తప్పనిసరిగా రిజిస్టర్ అయి, లైసెన్స్ కూడా వుండాలని స్పష్టంచేశారు. దీనికి దరఖాస్తు చేసుకునే వారు మత్స్య శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa