ఐపీఎల్ తాజా మ్యాచ్ ఎంతో ఆసక్తిగా సాగింది. ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్లను స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ ఓ ఆట ఆడుకొన్నాడు. ఐపీఎల్ తాజా సీజన్‌లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ దంచి కొట్టింది. పంజాబ్ స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ ముంబై బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (52)తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ధావన్ ఏకంగా 70 పరుగులు చేశాడు. 49 బంతులను ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో వీర విహారం చేశాడు. మరోవైపు మయాంక్ కూడా గబ్బర్‌కు ఏమాత్రం తగ్గకుండా 32 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు.
కెప్టెన్ ఔటైన తర్వాత రెండు వికెట్లు పటాపటా పడినప్పటికీ ఆ తర్వాత వచ్చిన జితేశ్ శర్మ (30) కూడా బ్యాటును ఝుళిపించాడు. గబ్బర్ అవుట్ అయ్యాక... జితేశ్‌కు జత కలిసిన షారూఖ్ ఖాన్ కేవలం 5 బంతుల్లోనే 15 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. వెరసి పంజాబ్ కింగ్స్ తన 20 ఓవర్ల బ్యాటింగ్‌లో 5 వికెట్ల
నష్టానికి 198 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్‌కు 199 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa