ట్రెండింగ్
Epaper    English    தமிழ்

22 ఏళ్లుగా గదిలో బందీగా మహిళ

national |  Suryaa Desk  | Published : Fri, Apr 15, 2022, 10:19 AM

ఓ మహిళను తన కుటుంబ సభ్యులు 22 ఏళ్లుగా ఇంట్లోనే బంధించారు. ఈ అమానవీయ ఘటన గుజరాత్​లో ని సూరత్​లో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గంగాబా చారిటబుల్​ ట్రస్ట్​ అనే ఓ ఎన్​జీఓ ఆమెను విడుదల చేయించింది. సూరత్​ లోని ఉదానాకు చెందిన బాధితురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, అందుకే గదిలో బంధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


బాధితురాలిని విడుదల చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదని ఎన్​జీఓ సభ్యులు జాల్పాబెన్ సొనానీ వెల్లడించారు. బాధితురాలు తన కర్మఫలాలను అనుభవిస్తోందని ఆమె భర్త చెప్పారని తెలిపారు. తమను అమ్మ బాగా హింసించేదని, ఆ సమయంలో మమ్మల్ని ఎవరూ ఆదుకోలేదని ఆమె పిల్లలు చెప్పారట. మీరు ఒకవేళ ఆమెను బలవంతంగా తీసుకెళ్తే మీపైన కూడా ఆమె దాడి చేస్తుందని బాధితురాలి పిల్లలు తమను హెచ్చరించినట్లు సొనానీ చెప్పారు. చివరకు పోలీసులు సాయంతో ఆ మహిళను విడిపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com