దేశంలోని పలు ప్రాంతాల్లో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న ప్రజలకు.., ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కేరళలో జరుపుకుంటున్న విషు.., పశ్చిమ బంగాల్ లో జరుపుకుంటున్న పొహెలా బైసాఖ్ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు అంతా మంచే జరగాలని........ ఆకాంక్షించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏసుక్రీస్తు ధైర్యాన్ని..., త్యాగాలను ప్రధాని గుర్తు చేశారు. సేవ, సోదరభావం వంటి వాటితో ఎంతో మందికి ఏసుక్రీస్తు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.