కోవిడ్ ఆంక్షలతో చైనా వాణిజ్య నగరం షాంఘైలో ప్రజల పరిస్థితి...దారుణంగా తయారైంది. బయటకొచ్చే వీలులేక, తినడానికి తిండిలేక...దయనీయమైన స్థితిని ఎదుర్కొంటున్నారు. తమకు ఆహారం అందించండి అంటూ కేకలు వేస్తున్న ప్రజలు...ఆకలితో చావడం కంటే...ఆత్మహత్యే శరణ్యం అంటూ...భవనాల బాల్కనీల్లోకి వచ్చి...పెద్దపెట్టున అరుస్తున్నారు. జైలుకెళ్తే కనీసం తిండి అయినా దొరుకుతుందనే ఆశతో అరెస్టు చేయండని...పోలీసులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. వారి పట్ల అధికారులు అత్యంత పాశవికంగావ్యవహరిస్తున్నారు.