బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో తాబేళ్ల సంరక్షణ కు చర్యలు చేపట్టారు. తాబేళ్లను సంరక్షించడం ద్వారా పునరుత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. జల కాలుష్యం నివారించటం లో తాబేళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఆలీవ్ రిడ్లే సముద్రపు తాబేళ్ల పిల్లలను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారి సతీమణి రమాదేవి సముద్రంలోవదిలారు.
తాబేళ్ల గుడ్ల సేకరణ, సంరక్షణ, వాటి పునరుత్పత్తి కేంద్రాన్ని బాపట్ల సూర్యలంక లో రాష్ట్ర అటవీ శాఖ ఏలూరు జోన్ అవనిగడ్డ అటవీ రేంజ్ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 30 పెద్ద తాబేళ్లు ఒడ్డుకు చేరి 3, 400 వరకు గుడ్లు పెట్టటం జరిగింది. వాటిని సంరక్షణలో ఉంచి
3 వేల వరకు పిల్లలను సముద్రంలోనికి వదిలివేయడం జరిగింది. ఆలీవ్ రిడ్లే కు చెందిన తాబేళ్ళు తమ సంతానోత్పత్తి కోసం సముద్ర తీరంలో ఇసుక ప్రాంతాలను ఎంపిక చేసుకుంటాయి.
120 నుండి 150 వరకు గుడ్లు పెట్టి ఇసుకతో కప్పేసి తిరిగి సముద్రంలోకి వెళ్లి పోతాయి. ఇవి ఎవరు గుర్తుపట్టలేని స్థితిలో వాటిని ఇసుకతో కప్పేసి అవి సముద్రంలోకి వెళ్లి పోతాయి.
సూర్యలంక సముద్ర తీరంలోని తాబేళ్ల సంరక్షణ సమితి వీటిని గుర్తించి సంరక్షిస్తూ వస్తోంది పది అంగుళాల లోతు గుండ్రంగా చేసి అందులో 100 నుండి 150 వరకు గుడ్లు పెట్టి వాటిని ప్రకృతి సహజసిద్ధంగా 50 నుంచి 55 రోజుల నుండి పిల్లలు బయటకు వస్తాయి తీరప్రాంతాల్లో తాబేలు గుడ్లు పెట్టిన ప్రాంతాన్ని గుర్తించి వాటిని ఇక్కడ ఒక సంరక్షణ కేంద్రంగా ఉంచుతారు గతంలో అటవీ శాఖ సహకారంతో ఈ ప్రాంతంలో దశరథమహారాజు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సొంత ఖర్చులతో నిర్వహించారు.