ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఎస్సీ మహిళ తానేటి వనిత ఎంపిక కావడం పట్ల ఏపీ ఎమ్మార్పీఎస్ ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీరాములు హర్షం వ్యక్తం చేశారు.
యాడికి మండల కేంద్రం చెన్నకేశవస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పండు శ్రీరాములు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్ సి కులాల పట్ల తమ అభిమానం చాటుకున్నారు అని అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఎస్సీ కులాల వారికి ఇప్పుడు ఇచ్చినన్ని పదవులు ఇవ్వలేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పండు శ్రీరాములు, జిల్లా అధ్యక్షుడు బూసి ఆది, రాయలసీమ జిల్లాల గౌరవ అధ్యక్షుడు బండి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షుడు పచ్చారు మేకల పల్లి ఆది, మండల అధ్యక్షులు పండు రామాంజనేయులు, నాగరాజు, జయచంద్ర , మస్తాన్ ఇతరులు పాల్గొన్నారు.