భక్తి ప్రవత్తులతో నాగుల రాళ్ల ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. కలకడ మండలం, దేవలంపేటలోని శ్రీ కామాక్షి సమేత సిద్దేశ్వర స్వామి ఆలయం ప్రక్కన ఉన్న రావి చెట్టు కింద ఈ కార్యక్రమం చేశారు. మొదట ఎల్లంకి మోహన్ నాయుడు, చంద్రకళ దంపతులు దేవాలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. అనంతరం వేప చెట్టు, రావి చెట్టుకు వివాహం జరిపించారు. నాగుల రాళ్ల ప్రతిష్టను విజయ సారథి శర్మ, జగన్నాథ శాస్త్రి వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దిపట్ల వెంకటరమణ నాయుడు, కొండమ్మ భక్తులు పాల్గొన్నారు.