యావత్తు ప్రపంచాన్ని ఊపేస్తున్న సినిమాలు వచ్చేస్తున్నాయి. మొన్నటి వరకు పుష్పా, ఆర్ఆర్ఆర్ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచినా జాబితాలో కొత్తగా కేజీఎఫ్-2 వచ్చి చేరింది. టాలెంట్ ఉన్నవారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. వాళ్లను ఎక్కడికో తీసుకుపోతారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలోని టాంజానియా దేశ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కిలీపాల్ స్వతహాగా డాన్సరైన కిలీపాల్... సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్ గా దుమ్మురేపుతున్నాడు. ముఖ్యంగా భారతీయ సినిమాల్లోని పాటలు, సీన్లను లిప్ సింక్ ఇస్తున్నాడు. అతని చెల్లి నీమా పాల్ కూడా అప్పుడప్పుడూ కిలీపాల్తో కలిసి లిప్ సింక్ ఇస్తూ ఉంటుంది. ఐతే... ఆమె కంటే కిలీపాలే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. తాజాగా అతను సూటూ బూటూ ధరించి... కేజీఎఫ్ 2 సినిమాలో హీరో యష్ చెప్పిన వయలెన్స్ డైలాగ్ కి చక్కగా లిప్ సింక్ ఇచ్చాడు.
ఆఫ్రికాలోని పేద దేశాల్లో ఒకటి టాంజానియా. అక్కడి ప్రజల్లో చాలా మంది వన్యమృగాల్ని వేటాడి తింటారు. పేదరికం వారికి వేరే ఆప్షన్ లేకుండా చేస్తోంది. అలాంటి చోట పుట్టిన కిలీపాల్ కూడా పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ... అతను తనలో టాలెంట్స్ని మెరుగుపరచుకుంటూ వచ్చాడు. ఇన్స్టాగ్రామ్లో లిప్ సింక్ వీడియోలు చేస్తూ... ప్రపంచం తనవైపు చూసేలా చేశాడు. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల సీన్లకు లిప్ సింక్, డాన్సులు చేస్తూ... వైరల్ సెన్సేషన్ అయ్యాడు. ఇదివరకు వీడియోల్లో సరైన షర్ట్ కూడా లేకుండా సంప్రదాయ మసాయ్ బట్టల్లో కనిపించిన కిలీపాల్... కేజీఎఫ్ 2 వీడియోలో మాత్రం సూట్ ధరించి కనిపించాడు. అదిరిపోయే ఇన్స్టాగ్రామ్ రీల్ ఇచ్చాడు.