సాంకేతికత పెరిగే కొద్దీ అనుకోని ప్రమాదాలు ఎదురవుతున్నాయి. తాజాగా సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్న క్రమంలో కరెంట్ షాక్ కొట్టడంతో ఓ బాలుడు మృతి చెందాడు. ఏపీలోని కర్నూలు జిల్లా డోన్ పట్టణం పోచా ప్రభాకర్ రెడ్డి నగర్లో శనివారం ఈ విషాద ఘటన జరిగింది. తన తండ్రి ఫోన్‌కు బాలుడు పుల్లయ్య ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో బాలుడు సంఘటనా స్థలంలోనే నిర్జీవంగా పడిపోయాడు. అది చూసి తల్లిదండ్రులు బోరున ఏడుస్తూ తమ కుమారుడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాలుడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో నిపుణులు ఈ విషయం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను బాత్రూంలో లేదా తడి చేతితో ఛార్జింగ్ పెట్టకూడదని పేర్కొంటున్నారు. తెగిన వైర్లతో ఉండే ఛార్జర్‌ను వినియోగించొద్దని సూచిస్తున్నారు.