ఐపీఎల్-2022లో వరుసగా ఆరు ఓటములతో ముంబై ఇండియన్స్ జట్టు ఘోర పరాభవాన్ని చవి చూసింది. దీనిపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. వరుస ఓటములకు తనదే బాధ్యతని అని చెప్పాడు. తమపై భారీ అంచనాలున్నాయని, వాటికి తగ్గట్టు జట్టును నడిపించలేకపోతున్నానని పేర్కొన్నాడు. తప్పులు ఏంటో తెలిస్తే సరిదిద్దుకోవచ్చని, అయితే అవి ఎక్కడ జరుగుతున్నాయో అర్ధం కావడం లేదన్నారు. ప్రతి మ్యాచ్కు బాగానే సన్నద్ధం అవుతున్నామని వివరించాడు. గతంలోనే ఇలాంటి ఓటములు ఎదురైనా, తిరిగి పుంజుకున్నామన్నారు. ఆరు మ్యాచ్లు ఓడిపోవడంతో జట్టు కూర్పును సమీక్షిస్తామన్నారు. బౌలర్లు రాణించాల్సిన అవసరం ఉందన్నాడు.