ఓ వ్యాపారి ఏమరపాటులో చేసిన నిర్లక్ష్యం విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన విద్యార్థి చావుబతుకుల్లో పోరాడుతున్నాడు. కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన చైతన్య అనే యువకుడు నాలుగు రోజుల క్రితం విజయవాడ రూరల్ ఎనికేపాడులో వాటర్ బాటిల్ కొన్నాడు. అయితే వాటర్ బాటిల్‌కు బదులు వ్యాపారి పొరపాటున యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. విషయం తెలియక అది తాగిన యువకుడు వెంటనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆ యువకుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడు కోలుకుంటున్నాడని అతడి తల్లిదండ్రులు చెప్పారు. ఈ ఘటన ఈ నెల 14న జరిగినా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.