ఆ బాలుడికి పదేళ్ల వయసు కూడా రాలేదు. తమ ఇంటి పక్కనే ఉన్న నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతున్న బాధిత బాలిక తన తల్లికి విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అంత చిన్న వయసులోనే బాలుడు లైంగిక దాడికి పాల్పడడంతో అంతా నివ్వెరబోతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉల్హాస్‌నగర్‌లో 9 ఏళ్ల బాలుడు తమ పొరుగింటిలో ఉంటున్న నాలుగేళ్ల చిన్నారిని ఆడుకుందామని ఏప్రిల్ 3న పిలిచాడు. ఆ తర్వాత బాలికను నిర్జన ప్రదేశానికి ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత తన ప్రైవేట్ పార్ట్స్‌లో నొప్పి వస్తుందని బాలిక తల్లికి చెప్పింది. ఆ తర్వాత బాలిక తల్లి ఆరా తీయగా విషయం బయట పడింది. ఈ ఘటనపై బాధిత బాలిక తల్లి శనివారం విఠల్వాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలుడిపై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం)తో పాటు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.