ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి పీఏ కిషోర్ కారణం అంటూ ప్రజాప్రతినిధులు, పార్టీ కేడర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా కోన అందరి వాడిగా అక్కున చేర్చుకున్న ప్రజలు నేడు పీఏ కిషోర్ అతి జోక్యం వల్ల కోనపై ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. పీఏగా కిషోర్ భాద్యతలు చేపట్టిన నాటి నుంచి రాజకీయ, పరిపాలన విషయంలో జోక్యం చేసుకోవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
గ్రామాల్లో కిషోర్ వర్గం ఒకటి ఉందని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కర్లపాలెంలో జరిగిన బహిరంగ సన్మాన కార్యక్రమంలో పీఏ కిషోర్ మైకులో చేసిన వాఖ్యలు దూమరం రేపి ఆగ్రహజ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులుపై కూడా అజ మాయిషీ చెలాయిస్తున్నాడని పీఏ కిషోర్ చెప్పిన వ్యక్తులకే పనులు జరుగుతాయంటూ ప్రచారం జరు గుతుంది. వివాదరహితుడిగా ఉన్న కోన రఘుపతి పీఏ కిషోర్ వల్ల వివాదాల్లో పడటంతోనే ఉపసభాపతి పదవి పోవటంతో పాటు మంత్రి పదవికి దూరమయ్యాడని చర్చ జరుగుతుంది.
పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు ఏవరో కోనకు తెలుసు కానీ కిషోర్ కోనాను కలవకుండా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నాడని మా జీవితాలు ఇంతేనా అంటూ పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కోన రఘు పతి పీఏ కిషోర్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకుని అసమ్మతిగా ఉన్న నాయకులను ఏకతాటి మీదకు తెచ్చుకుంటే తప్ప రేపు సీటుకు కూడా దూరమయ్యే పరిస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.