ఆదోని పట్టణం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బిచే ఆంజినప్ప కుమారుడు, కంప్యూటర్ ఆపరేటర్ రాజేష్ మృతి చెందడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పేర్కొన్నారు. ఆదోని ఆర్డిఓ కార్యాలయంలో ఈ మేనేజర్‌గా (కంప్యూటర్ సక్షన్) గత కొన్ని సంవత్సారాలుగా పని చేస్తున్నాడు.
గత కొన్ని రోజుల క్రితం రహదారి ప్రమాదంలో గాయాలుకాగా చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ కోలుకోలేక శనివారం మృతి చెందినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఆదోని తహశీల్దార్, ఆర్డిఓ కార్యాలయాలలోని అధికార యంత్రాంగంతోపాటు తోటి మిత్రులు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడు రాజేష్ అందరితో అప్యాయంగా మెగేవాడని, హఠాన్మరణం బాధాకరమని మిత్ర బృందం ఆవేదన వ్యక్తం చేశారు.