జిల్లా వ్యాప్తంగా పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించామని. ఎల్‌టీ సర్వీసులతో పాటు అధిక సామర్ధ్యం గల(హెచ్‌టీ) సర్వీసులకు సంబంధించి గతంలో రోజువారీ వినియోగించే విద్యుత్తులో ప్రస్తుతం 50శాతం మాత్రమే వినియోగించాలని. నిబంధనలు అతిక్రమించి అదనపు విద్యుత్తు వినియోగిస్తే సంబంధిత పరిశ్రమలపై చర్యలు తప్పవని విద్యుత్తు శాఖ చిత్తూరు అర్బన్ డివిజన్ ఈఈ అమరబాబు స్పష్టం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 23, 685 ఎల్‌టీ, హెచ్‌టీ సర్వీసులు ఉన్నాయి. పవర్ హాలిడే నిబంధనలపై ఇప్పటికే యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు. నిరంతరంగా పనిచేసే పరిశ్రమలు సాధారణ సెలవు రోజుతో పాటు శుక్రవారం అదనంగా పవర్ హాలిడేతో పాటు ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు విద్యుత్తు వినియెగించరాదన్నారు. అలాకాక అతిక్రమించి వినియోగిస్తే సంబంధిత యజమానులకు జరిమానా విధించడం సహా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.