డోన్ పట్టణంలోని నెహ్రూనగర్ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీపీయూ, ఇంటర్ నెట్ బాక్స్ లను దుండగులు ఎత్తుకెళ్లారు. శని వారం సాయంత్రం 5 గంటల సమయంలో పాఠశాలలోని 10వ తరగతి గది తాళాలు పగులగొట్టినట్లు ప్రధానోపాధ్యాయుడు రాంప్ర సాద్ తెలిపారు. డిజిటల్ తరగతులకు చెందిన సామగ్రిని అపహరించారన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa