రాష్ట్రంలోని 13 జిల్లాలకు అదనంగా మరో 13 కొత్త జిల్లాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా వికేంద్రీకరణ, పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారని ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం బేతంచేర్ల పట్టణానికి సమీపాన కర్నూలు రహదారిలోని షిర్డీసాయి కల్యాణ మండపంలో బుగ్గన రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గ్రామ, వార్డు వలంటీర్లు, సచివా లయ సిబ్బంది. ఆయా గ్రామాల ప్రజా ప్రతిని ధులతో బుగ్గన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ముందుగా సాయిబాబా ఆలయంలో కమిటీ సభ్యులు గుండా గోపాలు, బాబుల్రెడ్డి ఆహ్వానం మేరకు బాబాకు మంత్రి బుగ్గన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ వలంటీర్ల సేవలు అమోఘమన్నారు. సచివాలయాలు, వలంటీర వ్యస్థల ద్వారా అమలవుతున్న సంక్షేమపథకాలతో మిగత రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయని ఈ సందర్భం గా మంత్రి బుగ్గన గుర్తు చేశారు.