ఏపీలో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై దౌర్జన్యం చేశారని ఆయనపై అభియోగాలున్నాయి. దీంతో 304, 305, 188, 204 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జాతర ఏర్పాటు చేయగా, సమయం మించి పోతుందని పోలీసులు సూచించారు. దీంతో అక్కడకు చేరుకున్న అయ్యన్నపాత్రుడు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎస్సైను తోయడంతో పాటు పరుషంగా మాట్లాడారు. ఇంకో రెండేళ్లు ఆగితే అప్పుడు చూస్తాం అంటూ హెచ్చరించారు. అయితే విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడంతో ఆయనపై కేసు నమోదైంది. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని టీడీపీ ఆరోపిస్తుండగా, అయ్యన్న దురుసుతనం వల్లేనని వైసీపీ బదులిస్తోంది.