నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని గ్రామాల్లోని జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆర్డీవో మిరియాల దాసు సూచించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. కొన్ని గ్రామాల్లో పనులు ఆలస్యమవుతున్నాయని, వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిర్మాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.