గుంటూరు పార్లమెంట్ మైనార్టీ సెల్ టీడీపీ అధికార ప్రతినిధిగా మండలంలోని బేతపూడికి చెందిన షేక్ మహమ్మద్ ఫరూక్ నియమితులయ్యారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఫరూక్ అవిరళ కృషి చేసినందునే పదవి దక్కిందని ఈ సందర్భంగా మండల టీడీపీపార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. తన ఎంపికకు సహకరించిన గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa