ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ దేశానికి విమాన సర్వీసులు రద్దు

national |  Suryaa Desk  | Published : Mon, Apr 18, 2022, 11:56 AM

హాంకాంగ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ దేశం ప్రస్తుతం చైనాలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా ఉంది. అక్కడ కరోనా విలయతాండవం చేస్తోంది. ఫలితంగా ఈ నెల 19 నుంచి 23 వరకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. కరోనాతో పాటు డిమాండ్ తక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయర్ ఇండియా వెల్లడించింది. హాంకాంగ్‌ వెళ్లే భారతీయులు రెండు రోజుల ముందే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. నెగెటివ్ రిపోర్టు ఉంటేనే ఆ దేశానికి వెళ్లే అవకాశం ఉంది. ఇక కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో జనవరిలో ఇండియాతో పాటు 8 దేశాల నుంచి విమాన రాకపోకలపై హాంకాంగ్ 2 వారాలు ఆంక్షలు అమలు చేసింది. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa