కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పరిటాల బైపాస్‌లో వద్ద ఎదురుగా వెళ్తున్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి డివైడర్‌ను కూడా ఢీకొట్టింది. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం.. వివరాలిలా ఉన్నాయి. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు సమాచారం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంపై ట్రావెల్స్‌లో ఉన్న ప్రయాణికులు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa