తెలుగు దేశం పార్టీ 2019 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అప్పటినుండి నియోజక వర్గాలలో బాగా ప్రజాదరణ ఉన్న వారికీ ప్రాధాన్యత ఇవ్వడానికి టీడీపీ జాతీయ నాయకుడు చంద్ర బాబు నాయుడు పూనుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ కంచుకోట మాచర్ల నియోజక వర్గంలో ఇంచార్జి గ మార్పులు చెయ్యడం జరిగింది. దానిలో భాగంగా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ని నియమించడం జరిగింది. అప్పటి నుండి మాచర్లలో సమీకరణాలు మారిపోయాయి అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియచేసారు.