గుంటూరు లో నిషేధిక గుట్కా కలిగివున్న ఓ దుకాణం పై అరoడల్ పేట సీఐ రామా నాయక్ దాడి చేశారు. ఆరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని డొంక రోడ్డు ఒకటవ లైన్ లోని ఒక దుకాణంపై దాడి చేసి సోదాలు చేయగా దుకాణంలో 8వేల రూపాయల విలువ గల నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లు ఉండడంతో షాప్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా డొంక రోడ్డు, వసంతారాయ పురం కు చెందిన కోట నాగేశ్వరరావు, శ్రీను, సత్యనారాయణ అనే ముగ్గురు వ్యక్తులను సోమవారం రాత్రి ఆరండల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు.