భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో ఏప్రిల్ 2 నుంచి 16 వరకు జరిగిన శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో దేవస్థానానికి రూ. 1, 88, 09, 620 ఆదాయం లభించింది. శ్రీసీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకంకు సంబంధించి మొత్తం 20, 005 టికెట్లను ఆన్ లైన్, నేరుగా విక్రయించడానికి రెడీ చేయగా, వీటిలో కేవలం 12, 718 టికెట్లు మాత్రమే అమ్ముడు పోయాయి.
మొత్తం 7, 287 టికెట్లు విక్రమ్ కాకుండా మిగిలిపోయాయి. కళ్యాణం పట్టాభిషేకం టికెట్ల విక్రయం ద్వారా మొత్తం దేవస్థానానికి రూ. 1, 22, 53, 000లు ఆదాయం లభించింది. టికెట్టు భారీగా మిగిలి పోవడంతో దేవస్థానం ఆదాయానికి గండి పడింది. ఇదిలా ఉండగా లడ్డూల విక్రయం ద్వారా దేవస్థానానికి రూ. 38, 95, 500 లు ఆదాయం లభించింది. తలంబ్రాలు విక్రయం ద్వారా రూ. 2, 61, 120 ల ఆదాయం లభించింది. మొత్తంగా బ్రహ్మోత్సవాలకు శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానానికి రూ. 1, 88, 09, 620ల ఆదాయం లభించింది. ఇంకా హుండీ ఆదాయం లెక్కించాల్సి ఉంది.