వల్లభాపురం సమీపంలోని రేపల్లె కాల్వలో ఈతకు దిగి మహారాష్ట్ర నాందేడ్ కు చెందిన గజానన్ మారౌటి పాoచల్ ( 32 )మృతిచెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రామంలో జరుగుతున్న తిరునాళ్ళలో తల్లిని దర్శించుకునేందుకు అతడు వచ్చినట్లు సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. వల్లభాపురంకు చెందిన నడికుదిటి సతీష్ వర్మ వద్ద కూలీగా పాoచల్ పని చేస్తున్నాడు. ముఠామేస్త్రి సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.