ప్రజా ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ జిల్లాలో పలు ప్రాంతాల నుండి అనేక సమస్యలపై నేరుగా తమకు అందించిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి నివేదిక ఇవ్వడంతో పాటు ఆ సమస్యల్ని పరిష్కారించాలని జిల్లాలో సంభందిత పోలీస్, ఇతర అధికారులను ఆదేశించామన్నారు. ఫిర్యాదులు అందించేందుకు ఎస్పీ కార్యాలయానికి విచ్చేసిన వృద్ధులు, వికలాంగుల వద్దకు స్వయంగా వెళ్లి వారి సమస్యలపై అడిగి తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. కుటుంబ కలహాలు, భర్త, అత్త, వారింటి వేధింపులు ఆన్ లైన్ మోసాలు, భూ వివాదాలు ఇతర సమస్యల పై 57 ఫిర్యాదుదారులు జిల్లా ఎస్పికి అంద చేశారు.