బాపట్ల జిల్లా అయిన తరువాత తొలిసారిగా నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణ పై విద్యాశాఖ అధికారులు సూపరింటెండెంట్ లతో స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన సమీక్షలో నిబంధనల బుక్ లెట్ ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో 403 పాఠశాలలకు చెందిన 18236 మంది విద్యార్థులకు ఈ నెల 27 నుండి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. బాపట్ల పర్చూరు ఉప విద్యాశాఖ ల పరిధిలో జిల్లా వ్యాప్తంగా 113 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు 113 మంది డిపార్ట్మెంట్ అధికారులు మరో 113 మంది 1080 మంది ఇన్విజిలేటర్లు విధినిర్వహణలో పాల్గొంటారని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. విద్యార్థులు ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని స్పష్టంచేశారు. సమీక్ష లో జేసీ శ్రీనివాసులు, ఆర్ డి ఓ జి రవీంద్ర ఆర్ జె డి వి సుబ్బారావు , గుంటూరు జిల్లా డిఇఓ శైలజా, బాపట్ల జిల్లా డీఈఓ కార్యాలయ ఏ డి వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.