పేరేచర్లకు చెందిన మైనర్ బాలిక హత్యాచారం కేసులో పదిమంది వ్యక్తులను ఆరండల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. గతసంవత్సరం డిసెంబర్ 18వ తేదీన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి బలవంతపు వ్యభిచారం చేయించిన, 35మంది నిర్వహికులు, 29మంది విటులను గుంటూరు వెస్ట్ ఏఎస్పీ సుప్రజ అరెస్ట్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం మరో పది మంది ఆరండల్ పేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు గుంటూరు వెస్ట్ ఏఎస్పీ సుప్రజ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.