శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండల ఎంపీపీ రఫీ నాయక్ మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్దారెడ్డి ఆదేశాల మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో కూలీలను పని సక్రమంగా చేస్తున్నారా లేదా అని ఫీల్డ్ అసిస్టెంట్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపిపి మస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏ పీ ఓ మోహన మరియు ఫీల్డ్ అసిస్టెంట్ బాలకృష్ణ పాల్గొన్నారు.