క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా స్పోర్ట్స్ అధారిటీ ఆఫీసర్ శ్రీ నరసింహ రాజు అన్నారు. వారు మాట్లాడుతూ నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ నంద్యాల పట్టణంలో క్రీడాకారులకు అందుబాటులో ఉంటూ, పెద్ద పెద్ద నగరాలకు దీటుగా ప్రతిరోజు శిక్షణా తరగతులు నిర్వహించడం గర్వకారణమన్నారు.
అలాగే ఈ సమ్మర్ క్యాంపును పట్టణ ప్రజలు క్రీడాకారులు తల్లిదండ్రులు సద్వినియోగ పరుచుకోవాలి అని కోరారు.
ఈ అకాడమీ నుండి చాలా మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని, రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు. ఈ సందర్భంగ డాక్టర్ లక్ష్మయ్య , డాక్టర్ వినోద్ శ్రీనివాస్ గుప్తా లను అభినందించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ చీఫ్ కోచ్ టీ. రాధాకృష్ణ మరియు అథ్లెటిక్స్ కోచ్ సుబ్బారాయుడు పాల్గొన్నారు.