కడప రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్ కు వైద్య సిబ్బంది సీల్ వేశారు. ప్రిన్సిపాల్ సీటు కోసం సీనియర్, జూనియర్ దంత వైద్యుల మధ్య నెలకొన్న వివాదమే ఇందుకు కారణమని వైద్యులు అంటున్నారు.
తాజాగానే రిమ్స్ దంత వైద్యశాల ప్రిన్సిపాల్ గా సురేఖ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ నియామకం పట్ల అక్కడి వైద్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మీడియాలో వచ్చిన కథనాల దృష్ట్యా అధికారులు సీలును తొలగించారు.