శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు పంచాయతి దిబ్బలపాలెంలో కొన్ని సౌకర్యాలు, కాస్త మెరుగులు దిద్దితే గంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఆకట్టుకునేలా ఇసుక దిబ్బలతో పాటు నాగావళి నది సముద్రంలో ఇక్కడే కలుస్తుంది. సహజసిద్ధంగానే ఆకట్టుకునేలా ఉండే ఈ ప్రాంతానికి కొన్ని మెరుగులు దిద్ది ప్రచారం కల్పిస్తే పర్యాటకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళానికి సమీపంలో ఉండడం కూడా కలిసొచ్చే అంశం. అయితే పర్యాటక శాఖ అధికారులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.