పాచిపెంట మండలంలోని, వట్టిగెడ్డ ప్రాజెక్ట్ కు సంబందించి ప్రధాన కాలువల్లో ఆధునికరణ పనులు జరుగుతున్నాయి. జైకా నిధులు 24 కోట్ల రూపాయలు తో కుడి కాలువల్లో 18 కిలోమీటర్ల పొడవున పనులు ప్రారంభించారు.ప్రాజెక్ట్ కు అనుసంధానమైన వేగావతి అనకట్ట కుడి, ఎడమ కాలువల పనులు కూడా చేస్తున్నారు.ఈ పనులు పూర్తి అయితే ఏటా కాలువల్లో పూడికతీత బెడద తప్పుతుందని రైతులు చెబుతున్నారు.