మన ఆరోగ్య విషయంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే తినే ఆహారం అని ఎవరైనా టక్కున చెబుతారు. కానీ ఆహారంతో పాటు వండే పాత్రలు ఏ తరహా అన్నవి కూడా కీలకమన్న విషయం ఎందరికీ తెలుసు. ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కాకపోతే ఇందుకు ఆచరణే కీలకం అవుతుంది. సరైన పోషకాహారం ఆరోగ్యాన్నిస్తుంది. ఇందుకోసం ఎంపిక చేసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, వాటిని ఏ పాత్రల్లో సిద్ధం చేస్తున్నామనేది కూడా అంతే ముఖ్యం. తయారీ సమయంలో కొన్ని పాత్రలకు హానికరమైన రసాయన కోటింగ్ వినియోగిస్తుంటారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇది కరిగి ఆహారంలోకి వచ్చి చేరుతుంది. అది ఆహారంలోని పోషకాలను నిర్వీర్యం చేయడమే కాకుండా ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. రాగి, ఇత్తడి ఈ రెండూ ఆహారంలోని పోషకాలకు హాని చేయవు. రాగి ఇంకా మేలు చేస్తుందని ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి.
ఇత్తడి అన్నది ప్రత్యేకమైన లోహం కాదు. ఇందులో 70 శాతం రాగి ఉంటుంది. మిగిలిన 30 శాతం జింక్. ఇత్తడి పాత్రల్లో ఆహారాన్ని వండినప్పుడు కోల్పోయే పోషకాల పరిమాణం కేవలం 7 శాతంగానే ఉంటుంది. కాపర్, జింక్ ఈ రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. కాపర్ లోపిస్తే శరీర రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. రక్తహీనత, చర్మ సమస్యలకు దారితీస్తుంది. బియ్యం, పప్పు వంటి అసిడిక్ గుణాలు లేని ఆహార పదార్థాలకే ఇత్తడిని ఉపయోగించాలి.
రాగి పాత్రల్లో నీటిని నిల్వ చేయడం వల్ల సహజసిద్ధంగా శుద్ధి అవుతుంది. నీటిని ఎక్కువ రోజుల పాటు స్వచ్ఛంగా, తాజాగా ఉంచుతుంది. మనకు చేటు చేసే నీటిలోని సూక్ష్మ జీవులు ఫంగి, ఆల్గే, బ్యాక్టీరియాలను చంపేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు కాపర్ కు ఉన్నాయి. దీంతో అకారణంగా వచ్చే ఒళ్లు నొప్పులకు పరిష్కారంగా కాపర్ పాత్రల్లో నీటిని నిల్వ చేసుకోవచ్చు.
ఆహారంలోని ఐరన్ ను శరీరం గ్రహించడంలో కాపర్ సాయపడుతుంది. ఆయుర్వేదం అయితే.. రాత్రి సమయంలో కాపర్ పాత్రలో నీటిని నిల్వ చేసి మర్నాడు ఉదయం లేచిన వెంటనే తాగాలని చెబుతోంది. కాపర్ కు ఎలక్ట్రో మ్యాగ్నటిక్ పవర్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
మార్కెట్లో విక్రయించే క్యాస్ట్ ఐరన్ పెనాల గురించి తెలిసే ఉంటుంది. నాన్ స్టిక్ పాన్స్ పక్కన పడేసి క్యాస్ట్ ఐరన్ వాడడం మంచిది. నాన్ స్టిక్ పాన్స్ కు వేసే కోటింగ్ అధిక వేడి వద్ద కరిగి ఆహారంలోకి చేరుతుంది. దీనికి బదులు క్యాస్ట్ ఐరన్ వాడడం వల్ల శరీరానికి కొంత ఐరన్ చేరుతుంది. దాంతో ఐరన్ లోపం తగ్గిపోతుంది. క్యాస్ట్ ఐరన్ లేదా ఐరన్ పాత్రల్లో వాడుకోవడమే మంచిదన్నది వైద్యుల సూచన. నాన్ స్టిక్ తో పోలిస్తే క్యాస్ట్ ఐరన్ లో ఎటువంటి కోటింగ్ ఉండదు. ఎక్కువ కాలం పాటు ఉంటాయి.
దీన్నే కన్సా (కాంస్యం) అంటారు. టిన్, కాపర్ కలయికే కంచు. ఆహారంలోని అసిడిక్ ను తగ్గిస్తుంది. జీర్ణాశయం, పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆర్థరైటిస్ రోగుల్లో వాపు తగ్గడానికి సాయపడుతుంది. కాపర్, జింక్ ఇలా ఎన్నో మెటల్స్ తో కంచు తయారవుతుంది. ఆహారం సాఫీగా జీర్ణయమయ్యేందుకు కంచు పనిచేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa