పెళ్లైనా తన ప్రియురాలిని ఓ యువకుడు మర్చిపోలేకపోయాడు. ఆమెతో సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. వీరి వ్యవహారం తెలిసిన భర్త ఆమెకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే అర్ధరాత్రి వివాహితను కలవడానికి వచ్చిన ప్రియుడికి షాక్ తగిలింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆ యువకుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాలిలా ఉన్నాయి.
బీహార్‌లోని జముయ్ జిల్లా చకై పోలీస్ స్టేషన్ పరిధిలోని సరౌన్ సంగుటోల్ గ్రామంలో కాంచన్ దేవి అనే వివాహితను ఆమె ప్రియుడు ముఖేష్ దాస్ శనివారం రాత్రి కలవడానికి వచ్చాడు. వారిద్దరూ 2013 నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇది నచ్చని యువతి తల్లిదండ్రులు ఆమెను 2018 సంవత్సరంలో జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాకు చెందిన కామ్‌దేవ్ దాస్‌కి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి అయిన తర్వాత ఆమెకు భర్తతో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయినా తన ప్రియుడిని రహస్యంగా కలిసేది. దీంతో ఆమెకు భర్త దూరంగా ఉండేవాడు.
భార్యాభర్తలిద్దరికీ గొడవలు కావడంతో కాంచన్ దేవి పుట్టింటికి వచ్చేసింది. అక్కడకు కూడా అర్ధరాత్రి ఆమె ప్రియుడు ముఖేష్ వచ్చేవాడు. అయితే వీరిని బహిరంగంగా పట్టుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు నిశ్చయించుకున్నారు. అర్ధరాత్రి ముఖేష్ రాగానే ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా అక్కడకు చేరుకున్నారు. దీంతో కాంచన్ దేవి-ముఖేష్ వివాహం చేసుకోవాలనుకున్నారు. పెళ్లి జరిగిన తర్వాత పోలీసులను కలిసి విషయమంతా చెప్పారు. వారి నుంచి లెటర్ రాయించుకుని పోలీసులు పంపేశారు.