అనంతపురం నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 'ఆరోగ్యానికి భరోసా - ప్రగతికి హామీ' అనే నినాదంతో "ఆయుష్మాన్ భారత్ - ఆరోగ్య మేళా" (హెల్త్ క్యాంప్) కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కె. వి. ఉషశ్రీ చరణ్, స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.